Friday, 27 October 2017

LOVE IN SCHOOL LIFE PART-3

సఫియా  చూసిందని భయంతో అక్కడినుండి వెళ్ళిపోయినా రాజు, చందు స్కూల్ కి వెళ్లి లంచ్ చేసారు. లంచ్ బ్రేక్ అయిపొయింది మధ్యాహ్నం క్లాస్ మొదలైంది. సఫియా  కూడా వచ్చింది  క్లాస్ జరుగుతున్న టైం లో చందు వాళ్ల ని చూసింది. చందు గమనించాడు సఫీయ  చూడటాన్ని, రాజు తో బావ మనల్ని చూస్తుంది రా, టెన్షన్ గా ఉంది అని అన్నాడు.  క్లాస్ అయిపొయింది. తరువాత సోషల్  సబ్జెక్టు, స్కూల్ లో కొంచం జిడ్డు సార్ ఇతనే కొంచం MENTAL టైపు, దేనికి ఎలా REACT  అవుతాడో అర్థమే కాదు.  చందు వాళ్ల  గ్యాంగ్ అంటే పడని  గర్ల్స్ గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్లకి సఫియా  చెప్పింది చందు, రాజు నన్ను FOLLOW  చేసారు అని,  ఇంకా వెళ్లేందుకు ఊరుకుంటారు  సోషల్ సార్ కి మా భాగవతం అంత చెప్పేసారు. సార్ మమ్మల్ని లేవమన్నాడు, మేము లేచాము, ఇక్కడే ఒక  ట్విస్ట్ ఏంటంటే  సఫీయ  దృష్టిలో FOLLOW  చేసింది రాజు, వాడికి తోడు గా చందు వచ్చాడు అని. సార్  రాజు గాని ------- --------   --------  -------- బూతులు తిట్టాడు. వాడేమో నా దిక్కు చూస్తూ ఎందుకు రా నన్ను తీస్కెళ్ళావ్, అనవసరంగా నేను బుక్ అయ్యాను అన్నట్టు గా చూసాడు. నేను సైలెంట్ ఉంటే  కథ ఇంకోలా  అయితది అని కొంచం తెలివి ఉపయోగించా,   సార్ మేము ఆమెని FOLLOW చేయలేదు రాజు వాళ్ళ బాబాయి  ఇంటికి వెళ్లి కలిసొచ్చాము అంతే సార్ మాకేం తెలువదు, అని ముఖం కొంచం అమాయకంగా పెట్టాను సార్ CONVIENCE  అయ్యాడు నేను చెప్పిన దానికి, REVERSE  లో గర్ల్స్ నే తిట్టాడు, సినిమాలు చూసి ఏదేదో ఉహించుకుంటున్నారు అని ఎదో రెండు మాటలు అన్నాడు, ముందే చెప్పిన కదా కొంచం మెంటల్ అని. మేము కూర్చున్నాం కొంచం టెన్షన్ తగ్గింది.


                                          స్కూల్ అయిపోయాక నేను రాజు  ఇంటికి పోలేదు, మధ్యాహ్నం జరిగిన దాన్ని గురించే ఆలోచిస్తున్నాం, సార్ మనకి SUPPORT చేసిండు కాబట్టి బయట పడ్డాము లేకపోతే సినిమా ఎలా ఉండేది రా  అంటూ రాజు గాడు నన్ను కొడుతున్నాడు నవ్వుకుంటూ, నాక్కూడ నవ్వొస్తుంది రాజు గాడు బుక్ అయినందుకు. అలా మాట్లాడుకునేది అయిపోయాక ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోయాము. రాత్రి నిద్ర పోదాం అంటే నిద్రొస్తలేదు  సఫియ , మా క్లాస్ రూమ్, వాళ్ళ ఇల్లు ఏవ్ గుర్తొస్తున్నాయి. పిచ్చి పిచ్చి గ ఉంది. మొదటిసారి ఈ ఫీలింగ్స్ ఏంటో కొత్తగా, వింతగా, గమ్మత్తుగా ఉంది. తరువాత కొన్ని రోజులకి మాములుగా స్కూల్లో HANDWRITINGS  రాసుకొని రమ్మంటారు కదా, మా తెలుగు మేడం  అందరి నోట్స్ CORRECTION  చేసింది, ఎవరైనా ఒకరు  పంచేసేయండి నోట్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను కావాలనే నోట్స్ పంచడానికి  అందరి నోట్స్ లని తీస్కొని పంచుతున్నా, నా మనసులో మాత్రం సఫియ  నోట్స్ ఎప్పుడు వస్తదా  అనే ఉంది, అందరికి పేరుతో పిలిచి నోట్స్ ఇస్తున్న, సఫియ  నోట్స్ వచ్చింది ఇద్దాం  అంటే తన పేరు పలకడానికి ఇబ్బందయితుంది, పేరుతో పిలవకుండా తన బెంచ్ మీద నోట్స్ పెట్టేసాను. సఫియ  మనసులో,, సార్ కి చెప్పినందుకే న పేరు పిలవకుండా కోపంగా బెంచ్ మీద పెట్టి వెళ్ళిండేమో అనుకుంది.  కొంచం బాధపడుతున్న EXPRESSION కనిపించింది చందూకి , వాడికి అప్పుడొక  అయింది అమ్మాయిలు వెనకాల పడితే పట్టించుకోరు దూరం పెడితేనే మన గురించి ఆలోచిస్తారు అని.  కొద్దిగా గర్వన్గా కూర్చుంటూ రేపటి నుండి కొత్త రకంగా ట్రై చేయాలనీ అనుకున్నాడు.

                                                         (తరువాయి భాగం)

Thursday, 26 October 2017

LOVE IN SCHOOL LIFE PART-2

PRAYER చేయడానికి గ్రౌండ్ లోకి వెళ్లి లైన్ లో నిల్చున్నాడు, కళ్ళు మాత్రం సఫియానే వెతుకుతున్నాయి. PRAYER అయిపొయింది క్లాస్ లోకి వెళ్ళాడు, అమ్మాయి కొత్తగా వచ్చింది కదా PREVIOUS  NOTES అడుగుతుంది పక్కన ఉన్న క్లాసుమేట్స్ ని. చందు గాడు NOTES  ఇద్దాం అన్నట్టుగా వాడి బుక్స్ తీసాడు కానీ వాడి నోట్స్ అడపా దడపా రాసి ఉంది అంతే.  ఉదయానే మొదట గా PHYSICS  క్లాస్ మొదలైంది. వాడి కర్మ కొద్దీ సార్  క్లాస్ చెప్పకుండా నిన్న ఇచ్చినా హోంవర్క్ అడిగాడు సచ్చింది  గొర్రె అన్నట్టు ఉంది మనోడి పరిస్థితి. హోంవర్క్ చేయని వాలని నిల్చోమని సార్ చెప్పాడు ఇంకేముంది చందు  గాడు వాడి తొట్టి గ్యాంగ్ లేచి నిలపడ్డారు ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలూ  అబ్బాయిలు  లేచి నిలపడ్డారు. సార్ ఒక్కొక్కరిని  తిట్టడం స్టార్ట్ చేసాడు. అందరిని తిట్టినట్టు మనోడిని ఎందుకు తిడ్తాడు  ఎంతైనా స్పెషల్ గ్యాంగ్ కదా ఓ రేంజ్ లోనే క్లాస్ పీకాడు. పిల్ల ముందు పరువు పోయిందనే బాధలో కూర్చున్నాడు. ఏంట్రా మొదటి రోజే ఇట్లా అయిపొయింది అనుకుంటూ  ఉండగానే క్లాస్ అయిపొయింది.

తరువాత MATHS క్లాస్,,, సార్ రానే వచ్చాడు క్లాస్ స్టార్ట్ చేసాడు ఒక  THEOREM చెప్పి వాటి మీద PROBLEMS  ఇచ్చాడు చేయమని. మనోడి లోపల కొంచం EXCITEMENT  స్టార్ట్ అయింది ఎందుకంటే మనోడు MATHS  లో మాత్రం ఓ మోస్తారు తోపు. క్లాస్ లో అందరికంటే ముందు వీడే PROBLEMS  SOLVE  చేసాడు. మీకు తెలిసే ఉండొచ్చు MATHS మంచిగా చేసేవాలని సార్ వాళ్ళు పొగడటం కామన్. ఇక్కడే అదే జరిగింది సార్ చందు గాని పొగుడుతున్నారు సఫియా   కళ్ళు మనోడిపై పMATHS డ్డాయ్. ఇంతకముందు క్లాస్ లో తిట్టించుకున్నాడు  మరీ MATHS  క్లాస్ లో   మంచిగా ఎలా చదువుతున్నాడు అనే CONFUSION లో ఉంది అది బయటికి తెలియకుండా   తన పని తాను చేసుకుంటుంది. BREAK టైములో సఫియా  తన BENCHMATE  మౌనిక ని అడిగింది ఎవరతను MATHS అంత మంచిగా చేస్తాడా? అని. మౌనిక చెప్పింది అవును తను MATHS మంచిగా చేస్తాడు పేరు చందు అని.  ఆ టైంలో  మనోడు ఎం చేస్తున్నాడంటే లాస్ట్ బెంచ్ లో  కూర్చొని వాళ్లనే చూస్తున్నాడు కానీ వాళ్ళ మాటలు అర్థం కావట్లేదు. కొంచం దైర్యం చేసి వాళ్ళ బెంచ్ దగ్గరికి వెళ్లి మౌనిక ని పిలిచాడు  తాను ఏంటీ అని అడగగా ఎం అడగాలో అర్థం కాక ఫిజిక్స్ నోట్స్ అడిగాడు టెన్షన్ గా. నోట్స్ తీసుకుంటూ ఏం  పేరు అని సఫియా  వైపు చూపిస్తూ అడిగాడు. సఫియా  అని మౌనిక అని చెప్పింది. ఆ రోజు   అలా  అలా  గడిచిపోయింది. స్కూల్ అయిపొయింది ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. FOLLOW  చేద్దాం అనుకున్నాడు కానీ దైర్యం సరిపోలేదు. రేపు చూసుకుందాం అనుకోని ఇంటికెళ్ళాడు.  


తరువాతి రోజు స్కూల్ కి వెళ్లి గ్రౌండ్ లో ఎదురుచూస్తునాడు సోఫియా కోసం, రాజు వచ్చాడు అంతలోనే, BAG  లోపల పెట్టి వస్తా బావ అని క్లాస్ లోకి వెళ్ళి  వచ్చాడు. రాజు తో మాట్లాడుతూ ఉండగా శివ, రంజిత్, వంశీ లు వచ్చారు, వాళ్ళంతా  కలిసి స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్ళారు. PRAYER BELL  మోగింది, అందరు గ్రౌండ్ లోకి వచ్చారు వాళ్ళ క్లాస్ లైన్ లో సోఫియా కూడా  అరే  నీయమ్మా  ఇదెప్పుడొచ్చిందిరా  అని మనసులో అనుకున్నాడు.  రోజూ  లాగానే క్లాస్ లు జరిగాయి, లంచ్ బెల్ అయింది సఫియా  బాక్స్ తెచ్చుకోలేదు అనుకుంటా ఇంటికెళ్లింది తినడానికి. వెంబడి వెళ్దాం అనుకున్నాడు ఒక్కడిని ఎలా వెళ్లాలో అర్థం కాలేదు,  రాజు ని తీసుకెళ్దాం అనుకున్నాడు, వాడికి చెప్పాలంటే కూడా కొచం టెన్షన్ గ ఉంది చెప్తే ఏం  అంటాడో అని. మొత్తానికి ఆ రోజు కూడా FOLLOW  చేయడం కుదరలేదు. తరువాత రోజు గురువారం  UNIFORM  ఉండదు, రోజు లాగానే స్కూల్ కి వచ్చి గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నాడు. ప్రేయర్ కి 5ని,,ల ముందు వచ్చింది. తాను నీలి రంగు పంజాబీ డ్రెస్ వెస్కొని వచ్చింది, లవ్ లో ఉంటే   ఇంతేనేమో  మనోడు కూడా నీలం రంగు షర్ట్ వెస్కొని వచ్చాడు.ప్రేయర్ అయిపొయింది, క్లాస్ లు అయిపోయాయి, LUNCH BELL  అయింది. సఫియ  ఇంటికి బయలుదేరింది, ఈ రోజు కచ్చితంగా వెంబడి వెళ్లాలని అనుకున్నాడు, ఎందుకంటే ఇద్దరు ఒకే  కలర్ డ్రెస్ వెస్కొని వచ్చారు కదా ఇద్దరి మధ్య  దేవుడు ఎదో రాసి పెట్టిండు  అనుకున్నాడు. రాజు ని వెంటపెట్టుకొని FOLLOW చేస్తూ వెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గర్లో ఒక మలుపు దగ్గర్లో తాను మళ్లింది వీళ్ళు కొంచం స్పీడ్ పెంచి ముందుకి వెళ్ళారు.  తాను కనిపించలేదు. అలాగే ముందుకి కొంత దూరం వెళ్లి వెతికి వచ్చారు కానీ సఫియా కనిపించలేదు. మళ్ళీ ఆ మలుపు దగ్గరికి వచ్చారు ఎందుకో మనోడికి వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటదేమో  అన్పించింది అక్కడ ఉన్న ఇళ్ళని చూస్తున్నాడు. SUDDENగా  పక్కన ఒక ఇంటివైపు చూస్తే చూస్తే పైనుండి సఫియా  వీళ్ళని చూస్తుంది.. మనోడికి టెన్షన్ స్టార్ట్ అయింది అక్కడినుండి  వెళ్లిపోయారు. 


                                                             (తరువాయి భాగం) 

Wednesday, 25 October 2017

ప్రియా నీ మీదే ఆశగా…………….!!! PART-1

అబ్బాయ్(వంశీ)  తను మొదటి సారి అమ్మాయి ని చుసిన క్షణం లో  అసలేం అనుకోలేదు.
ఎందుకంటే  ఆ అబ్బాయ్ ఇంతకు ముందే ఒక అమ్మాయి ని ప్రేమించి వన్  సైడ్ లవ్ లో వున్నాడు.
ఆ విషయం పక్కన పెడితే!!!!

అబ్బాయ్ అప్పుడు ఇంటర్ ప్రథమ సంవత్సరం లో వుండగా చాల సరదాగా అందరితో ఆడుతూ పాడుతూ తిరిగేవాడు.

కొన్ని రోజుల తర్వాత............

ఒక రోజు అబ్బాయ్ ఎప్పటిలాగానే క్లాసు కి వెళ్లి క్లాసురూం లో సరదాగా గడిపాడు. ఇంతలో LUNCH BELL  మోగింది. సార్  క్లాస్  నుండి వెళ్ళిపోయాడు,   అందరిని నవ్వించాలని సరదాగా కామెడీ చేస్తూ వెక్కిరిస్తూ  ఒక పాట పాడాడు ( రోజా వె చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే .............. అంటూ )  ఐతే  ఇక్కడే ఒక గమతైన విషయం జరిగింది. ఆ క్లాస్ రూం లో రోజా అనే ఒక అమ్మాయి వుంది ఆ విషయం అబ్బాయ్ గారికి తెలియదు  అందరు మన హీరో  & హీరోయిన్ ( అబ్బాయ్ & అమ్మాయి ) ని చూసి నవ్వటం మొదలు పెట్టారు . మన హీరో గారికి విషయం తెలియక తనుకూడా నవ్వుతు తినటానికి బయలుదేరాడు. తన స్నేహితుడు   తినే సమయంలో కూడా నవ్వడం తో DOUBT వచ్చి  అడిగాడు, ఎందుకురా  అందరు అలా   నవ్వారో తెలుసుకునాడు. అంతే మనోడి గుండే రైలు పరిగెత్తినంత పనయింది  క్లాసు రూం లోకి వెళ్ళాలంటే భయం భయం  గా వుంది. క్లాస్ రూమ్ బయటే తిరుగుతున్నాడు కానీ లోపలి వెళ్లట్లేదు క్లాస్ స్టార్ట్ అయ్యాక లోపలి వెళ్ళాడు. వెళ్లనైతే వెళ్ళాడు కానీ లోపల ఎదో కొంచం టెన్షన్ కొంచం ఆత్రుత ఇంతకి రోజా ఎవరో తెలుసుకోవాలని. అంత బయం గా వున్నా కూడా తన CLASSMATE  తాహెర్ ని అడిగాడు మామ రోజా ఎవరూ అని,వాడు చేయించాడు 3వ బెంచ్ లో మధ్యలో కూర్చుంది చూడు అని. అప్పుడు చూసాడు మన హీరో హీరోయిన్ ని ( ఎంత అందంగా వుందంటే పొడుగ్గా , ముందుకి వేస్తే మోకాళ్ళ వరకు వచ్చే అందమైన జడ. అప్పుడపుడు వెనక్కి మళ్ళినపుడు  చూసే చూపులు , ఆ రోజు తను వేసుకున్న లైట్ YELLOW  కలర్ డ్రెస్ ఎప్పటికి మనసులో మెదులుతూనే ఉంటాయ్)  అందరితో నవుతూ మాట్లాడుతూ వున్నా తనని చూస్తూనే  వున్నాడు మనవాడి చూపులని అమ్మాయి పట్టేసింది అంతే  మన హీరో కి గుండె లో  గంటలు మోగాయి.   ఆ రోజంతా అలా  అలా గడిచిపోయింది ఆరోజు తనతో ఏమీ  మాట్లాడకుండా భయం గా ఇంటికి వెళ్ళిపోయాడు .


 మరుసటి రోజు.............     హీరో క్లాసు కి తొందరగా వెళ్లి కుర్చునాడు రోజా తో  మాట్లాడాలని.   అందరు వచ్చేసారు తాను మాత్రం రాలేదు. ఎప్పుడు అందరితో సరదాగా నవ్వుతు వుండే హీరో ఈ రోజు మాత్రం TENSIONగా  కుర్చునాడు పక్కన వున్న  స్నేహితులు మాత్రం గమనిస్తూనే వున్నారు వంశీ ని . క్లాస్ లోకి సార్ వచ్చాడు క్లాసు మొదలుపెట్టబోయే సమయానికి హీరోయిన్ వచ్చేసింది మన హీరో నవుతూ తన వైపు చూసాడు హీరోయిన్ మాత్రం TENSION గా లోపలి వచ్చి కూర్చుంది.  మన హీరో తనని ఎందుకలా TENSION గా ఉందని   ఆలోచిస్తూ కుర్చున్నాడు.సాయంత్రం STUDY HOURS  లో తొందరగా వెళ్ళిపోయాడు . ఇది  గమనించిన తన స్నేహితులు మరుసటి రోజు హీరో క్లాసు రూం లోకి రాగానే అందరు చూసి నవ్వుతూ  ఇంక రాలేదు లేరా అని కామెంట్ చేసారు మన హీరోకి మాత్రం ఏం అర్థం కాలేదు సైలెంట్ గా కుర్చునాడు ఇంతలో హీరోయిన్ వచేసింది.  అందరు రోజా క్లాసు రూమ్ లోనికి రావడాన్ని  గమనించి బెంచిలపై చేతులతో కొడుతూ వంశీ వంశీ ............................ అని అరుస్తున్నారు.  మన హీరో వెంబడే హీరోయిన్ వైపు చూస్తూ నవ్వాడు తను కూడా చిన్నగా హీరో వైపు చూస్తూ  నవ్వసాగింది మన హీరో మాత్రం ఆ రోజు మొత్తం చాల హ్యాపీ గా గడిపాడు . రోజు STUDY HOURS లో తన ముస్లిం స్నేహితుడైన తాహేర్ తో  కూర్చునే వాడు ఒక రోజు హీరో తన స్నేహితుడితో రోజా తో మాట్లాడాలని వుంది అని చెప్పాడు. తాహేర్  హీరోయిన్ స్నేహితురాలు ఐన రవళితో విషయం చెప్పాడు, వాళ్ళ  ముందున్న బెంచి లో ఎవర్ని కుర్చోవద్దని చెప్పి హీరోయిన్ స్నేహితురాలు ఐన రవళిని రమ్మన్నాడు. రవళి తన స్నేహితురాలు ఐన రోజాతో కలిసి వచ్చి కూర్చుంది . ఇక మన హీరోకి బాడీ మొత్తం షేక్ అవుతుంది తన స్నేహితుడు రేయ్ వంశీ.... BHAABI  వచ్చింది రా వచ్చి మాట్లాడు అనగానే మన హీరోయిన్ విన్ని కాస్త వెనక్కి జరిగి మన హీరో బెంచి కి అనుకొని నవ్వసాగింది.  మన హీరో కి అర చేతిలో  చమట పట్టసాగింది, వణుకుతున్న గొంతు తో  తను మెల్లిగా హీరోయిన్ తో సారీ చెప్పాడు. దానికి హీరోయిన్ ఆ రోజు ఎందుకలా చేసావ్ అని అడగ్గా తను నాకు నీ పేరు  తెలియదు అందుకేపాడాను ఇకపై  ఎప్పుడు అల చేయను అంటూ మాట్లాడసాగారు. కొద్దిగా దైర్యం ఏదో కొంచం ఆశతో రోజు తనని ఫాల్లో అవ్వటం మొదలు పెట్టాడు. తనేమో వాళ్ల  FRIENDSతో నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంది మనోడు తాహెర్, అనిల్, సతీష్ లతో కలిసి CYCLES పట్టుకొని వెనకాలే వెళ్ళటం దినచర్య అయిపొయింది.   ఒక రోజు రోజా తన ఫ్రెండ్ తో అడిగించింది మీతో సైకిల్స్ ఉన్నాయ్ కదా మా వెంబడి ఎందుకు FOLLOW అవుతున్నారు, మా వెంబడి రాకండి ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. మనోడు వింటాడా రోజా వాలా ముందుకి వెళ్లి కావాలని సైకిల్ లో గాలి  తీసేసి తనతో పాటే నడుస్తూ వెళ్ళాడు. అంతలోనే హీరోయిన్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది,   మన హీరో ఎవరైనా చూస్తే బాగోదని వెన్నక్కి తిరిగి హీరోయిన్ ని చూస్తూ అక్కడి నుండి  వెళ్ళిపోయాడు. 

                                                       ( ఇంకా ఉంది )





LOVE IN SCHOOL LIFE PART-1

8వ  తరగతి అప్పుడే టీనేజ్ మొదలవుతుంది. ఆ వయసులో వచ్చే మార్పులు  మీకు  తెలిసే ఉండొచ్చు.
అప్పటివరకు క్లాస్ లో బాయ్స్  కి గర్ల్స్ కి మధ్య  గొడవలు  చాలానే ఉంటాయి, క్లారిటీ గా  చెప్పాలంటే శత్రువుల్లాగా 
ఉంటారు. కానీ టీనేజ్ వచ్చేసరికి అమ్మాయిలతో మాట్లాడటానికి సిగ్గుపడటాలు మొదలయితయ్, అప్పుడే వస్తున్న మీసాలతో పాటు కొత్త కొత్త కోరికలు కూడా స్టార్ట్ అవుతాయి. రోజు మనం చూసే ఫ్రెండ్ కొత్తగా, వీడికి చాల విషయాలు తెలుసు రా  అనుకుంటాం.  ముక్యంగా గేమ్స్ కోసం అని INTERNET CAFE కి వెళ్లడం, గేమ్స్ ఆడుతూ ఆడుతూ వేరే వీటికి DIVERT అవ్వడం, జీవిత రహస్యాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా అబ్బాయిలలో  మార్పు వస్తే, మరీ  అమ్మాయిల మార్పు ఎలా ఉంటదో  చూద్దాం. అమ్మాయిలు   మార్పు అనేది బయటికి కనిపించకుండా ప్రవర్తిస్తుంటారు అయినప్పటికీ వాళ్లలో మార్పుని గమనించవచ్చు, కానీ  ఈ TOPIC గురించి  DEPTH కి వెళ్లడం వల్ల  లేనిపోని DOUBTS  వస్తాయ్ SO ఈ TOPIC ఇక్కడే వదిలేద్దాం. 


            ఇక కథలోకి వద్దాం. 8th  క్లాస్ అయిపోయి వేసవి సెలువులని సినిమాలతో గడిపేసి తిరిగి SCHOOL ప్రారంభించేసరికి  9th క్లాస్ లోకి వచ్చేస్తాం. ఈ 9 అనేది సెమి ఫైనల్ లాంటిది చాలా బలమైనది మరియు  కీలకమైనది. అందుకే దీన్ని  PRE 10TH అని అంటారు. అంతేనా అంటే  స్కూల్ లైఫ్ లో టార్చర్ అనేది మొదలయ్యేది ఇపుడే,   ఇప్పటినుండే ఫైనల్ ఎగ్జామ్స్ అనేలా టార్చర్ చూయిస్తుంటారు.  స్టడీస్ ని పక్కనపెట్టేసి లవ్ స్టోరీ కి వద్దాం  ఇంకా .   ముందు గా హీరో గురించి తెల్సుకుందాం పేరు చందు ఇతనికి ఓ తొట్టి  గ్యాంగ్ ఉంది, రాజు, రంజిత్, వంశీ,సతీష్, శివ వీళ్ళే ఆ తొట్టి గ్యాంగ్. ఏ చెత్త పని చేసిన వీళ్లు  అందరు కలిసి చేయాల్సిందే. స్కూల్ జూన్ లో RE-OPEN అయితే జూన్ ఎండింగ్  లో క్లాస్ లో కొత్త అమ్మాయి జాయిన్ అయింది పేరు సఫియ ముస్లిం అమ్మాయి. చందు వాల గ్యాంగ్ తో, మామ! ఒక్కతి కూడా బాగాలేదు రా మన క్లాస్ లో అంటుంటే, పక్కన వాలా క్లాసుమెట్ వాయిస్  క్లాసుకి కొత్త పిల్ల వచ్చింది సూపర్ రా అని, వీడి మనసులో పిల్లని చూద్దాం అనే ఆతురత పెరిగింది వెంటనే  క్లాస్ వైపు పరిగెత్తాడు. క్లాస్ DOOR  దగ్గరికి వచ్చేసరికి PRAYER BELL మోగింది క్లాస్ లో నుండి అమ్మాయిలు బయటికి వస్తున్నారు వీడు DOOR లోకి ENTER  అవగానే ఒక అమ్మాయి DASH  ఇచ్చింది మీరు EXPECT చేసినట్టుగానే DASH  ఇచ్చింది సఫియ నే    ఇంకేముంది చూడగానే సార్ ఫ్లాట్. 
                                                      (తరువాయి భాగం )