Friday, 27 October 2017

LOVE IN SCHOOL LIFE PART-3

సఫియా  చూసిందని భయంతో అక్కడినుండి వెళ్ళిపోయినా రాజు, చందు స్కూల్ కి వెళ్లి లంచ్ చేసారు. లంచ్ బ్రేక్ అయిపొయింది మధ్యాహ్నం క్లాస్ మొదలైంది. సఫియా  కూడా వచ్చింది  క్లాస్ జరుగుతున్న టైం లో చందు వాళ్ల ని చూసింది. చందు గమనించాడు సఫీయ  చూడటాన్ని, రాజు తో బావ మనల్ని చూస్తుంది రా, టెన్షన్ గా ఉంది అని అన్నాడు.  క్లాస్ అయిపొయింది. తరువాత సోషల్  సబ్జెక్టు, స్కూల్ లో కొంచం జిడ్డు సార్ ఇతనే కొంచం MENTAL టైపు, దేనికి ఎలా REACT  అవుతాడో అర్థమే కాదు.  చందు వాళ్ల  గ్యాంగ్ అంటే పడని  గర్ల్స్ గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్లకి సఫియా  చెప్పింది చందు, రాజు నన్ను FOLLOW  చేసారు అని,  ఇంకా వెళ్లేందుకు ఊరుకుంటారు  సోషల్ సార్ కి మా భాగవతం అంత చెప్పేసారు. సార్ మమ్మల్ని లేవమన్నాడు, మేము లేచాము, ఇక్కడే ఒక  ట్విస్ట్ ఏంటంటే  సఫీయ  దృష్టిలో FOLLOW  చేసింది రాజు, వాడికి తోడు గా చందు వచ్చాడు అని. సార్  రాజు గాని ------- --------   --------  -------- బూతులు తిట్టాడు. వాడేమో నా దిక్కు చూస్తూ ఎందుకు రా నన్ను తీస్కెళ్ళావ్, అనవసరంగా నేను బుక్ అయ్యాను అన్నట్టు గా చూసాడు. నేను సైలెంట్ ఉంటే  కథ ఇంకోలా  అయితది అని కొంచం తెలివి ఉపయోగించా,   సార్ మేము ఆమెని FOLLOW చేయలేదు రాజు వాళ్ళ బాబాయి  ఇంటికి వెళ్లి కలిసొచ్చాము అంతే సార్ మాకేం తెలువదు, అని ముఖం కొంచం అమాయకంగా పెట్టాను సార్ CONVIENCE  అయ్యాడు నేను చెప్పిన దానికి, REVERSE  లో గర్ల్స్ నే తిట్టాడు, సినిమాలు చూసి ఏదేదో ఉహించుకుంటున్నారు అని ఎదో రెండు మాటలు అన్నాడు, ముందే చెప్పిన కదా కొంచం మెంటల్ అని. మేము కూర్చున్నాం కొంచం టెన్షన్ తగ్గింది.


                                          స్కూల్ అయిపోయాక నేను రాజు  ఇంటికి పోలేదు, మధ్యాహ్నం జరిగిన దాన్ని గురించే ఆలోచిస్తున్నాం, సార్ మనకి SUPPORT చేసిండు కాబట్టి బయట పడ్డాము లేకపోతే సినిమా ఎలా ఉండేది రా  అంటూ రాజు గాడు నన్ను కొడుతున్నాడు నవ్వుకుంటూ, నాక్కూడ నవ్వొస్తుంది రాజు గాడు బుక్ అయినందుకు. అలా మాట్లాడుకునేది అయిపోయాక ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోయాము. రాత్రి నిద్ర పోదాం అంటే నిద్రొస్తలేదు  సఫియ , మా క్లాస్ రూమ్, వాళ్ళ ఇల్లు ఏవ్ గుర్తొస్తున్నాయి. పిచ్చి పిచ్చి గ ఉంది. మొదటిసారి ఈ ఫీలింగ్స్ ఏంటో కొత్తగా, వింతగా, గమ్మత్తుగా ఉంది. తరువాత కొన్ని రోజులకి మాములుగా స్కూల్లో HANDWRITINGS  రాసుకొని రమ్మంటారు కదా, మా తెలుగు మేడం  అందరి నోట్స్ CORRECTION  చేసింది, ఎవరైనా ఒకరు  పంచేసేయండి నోట్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను కావాలనే నోట్స్ పంచడానికి  అందరి నోట్స్ లని తీస్కొని పంచుతున్నా, నా మనసులో మాత్రం సఫియ  నోట్స్ ఎప్పుడు వస్తదా  అనే ఉంది, అందరికి పేరుతో పిలిచి నోట్స్ ఇస్తున్న, సఫియ  నోట్స్ వచ్చింది ఇద్దాం  అంటే తన పేరు పలకడానికి ఇబ్బందయితుంది, పేరుతో పిలవకుండా తన బెంచ్ మీద నోట్స్ పెట్టేసాను. సఫియ  మనసులో,, సార్ కి చెప్పినందుకే న పేరు పిలవకుండా కోపంగా బెంచ్ మీద పెట్టి వెళ్ళిండేమో అనుకుంది.  కొంచం బాధపడుతున్న EXPRESSION కనిపించింది చందూకి , వాడికి అప్పుడొక  అయింది అమ్మాయిలు వెనకాల పడితే పట్టించుకోరు దూరం పెడితేనే మన గురించి ఆలోచిస్తారు అని.  కొద్దిగా గర్వన్గా కూర్చుంటూ రేపటి నుండి కొత్త రకంగా ట్రై చేయాలనీ అనుకున్నాడు.

                                                         (తరువాయి భాగం)

No comments:

Post a Comment