PRAYER చేయడానికి గ్రౌండ్ లోకి వెళ్లి లైన్ లో నిల్చున్నాడు, కళ్ళు మాత్రం సఫియానే వెతుకుతున్నాయి. PRAYER అయిపొయింది క్లాస్ లోకి వెళ్ళాడు, అమ్మాయి కొత్తగా వచ్చింది కదా PREVIOUS NOTES అడుగుతుంది పక్కన ఉన్న క్లాసుమేట్స్ ని. చందు గాడు NOTES ఇద్దాం అన్నట్టుగా వాడి బుక్స్ తీసాడు కానీ వాడి నోట్స్ అడపా దడపా రాసి ఉంది అంతే. ఉదయానే మొదట గా PHYSICS క్లాస్ మొదలైంది. వాడి కర్మ కొద్దీ సార్ క్లాస్ చెప్పకుండా నిన్న ఇచ్చినా హోంవర్క్ అడిగాడు సచ్చింది గొర్రె అన్నట్టు ఉంది మనోడి పరిస్థితి. హోంవర్క్ చేయని వాలని నిల్చోమని సార్ చెప్పాడు ఇంకేముంది చందు గాడు వాడి తొట్టి గ్యాంగ్ లేచి నిలపడ్డారు ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలూ అబ్బాయిలు లేచి నిలపడ్డారు. సార్ ఒక్కొక్కరిని తిట్టడం స్టార్ట్ చేసాడు. అందరిని తిట్టినట్టు మనోడిని ఎందుకు తిడ్తాడు ఎంతైనా స్పెషల్ గ్యాంగ్ కదా ఓ రేంజ్ లోనే క్లాస్ పీకాడు. పిల్ల ముందు పరువు పోయిందనే బాధలో కూర్చున్నాడు. ఏంట్రా మొదటి రోజే ఇట్లా అయిపొయింది అనుకుంటూ ఉండగానే క్లాస్ అయిపొయింది.
తరువాత MATHS క్లాస్,,, సార్ రానే వచ్చాడు క్లాస్ స్టార్ట్ చేసాడు ఒక THEOREM చెప్పి వాటి మీద PROBLEMS ఇచ్చాడు చేయమని. మనోడి లోపల కొంచం EXCITEMENT స్టార్ట్ అయింది ఎందుకంటే మనోడు MATHS లో మాత్రం ఓ మోస్తారు తోపు. క్లాస్ లో అందరికంటే ముందు వీడే PROBLEMS SOLVE చేసాడు. మీకు తెలిసే ఉండొచ్చు MATHS మంచిగా చేసేవాలని సార్ వాళ్ళు పొగడటం కామన్. ఇక్కడే అదే జరిగింది సార్ చందు గాని పొగుడుతున్నారు సఫియా కళ్ళు మనోడిపై పMATHS డ్డాయ్. ఇంతకముందు క్లాస్ లో తిట్టించుకున్నాడు మరీ MATHS క్లాస్ లో మంచిగా ఎలా చదువుతున్నాడు అనే CONFUSION లో ఉంది అది బయటికి తెలియకుండా తన పని తాను చేసుకుంటుంది. BREAK టైములో సఫియా తన BENCHMATE మౌనిక ని అడిగింది ఎవరతను MATHS అంత మంచిగా చేస్తాడా? అని. మౌనిక చెప్పింది అవును తను MATHS మంచిగా చేస్తాడు పేరు చందు అని. ఆ టైంలో మనోడు ఎం చేస్తున్నాడంటే లాస్ట్ బెంచ్ లో కూర్చొని వాళ్లనే చూస్తున్నాడు కానీ వాళ్ళ మాటలు అర్థం కావట్లేదు. కొంచం దైర్యం చేసి వాళ్ళ బెంచ్ దగ్గరికి వెళ్లి మౌనిక ని పిలిచాడు తాను ఏంటీ అని అడగగా ఎం అడగాలో అర్థం కాక ఫిజిక్స్ నోట్స్ అడిగాడు టెన్షన్ గా. నోట్స్ తీసుకుంటూ ఏం పేరు అని సఫియా వైపు చూపిస్తూ అడిగాడు. సఫియా అని మౌనిక అని చెప్పింది. ఆ రోజు అలా అలా గడిచిపోయింది. స్కూల్ అయిపొయింది ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. FOLLOW చేద్దాం అనుకున్నాడు కానీ దైర్యం సరిపోలేదు. రేపు చూసుకుందాం అనుకోని ఇంటికెళ్ళాడు.
తరువాతి రోజు స్కూల్ కి వెళ్లి గ్రౌండ్ లో ఎదురుచూస్తునాడు సోఫియా కోసం, రాజు వచ్చాడు అంతలోనే, BAG లోపల పెట్టి వస్తా బావ అని క్లాస్ లోకి వెళ్ళి వచ్చాడు. రాజు తో మాట్లాడుతూ ఉండగా శివ, రంజిత్, వంశీ లు వచ్చారు, వాళ్ళంతా కలిసి స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్ళారు. PRAYER BELL మోగింది, అందరు గ్రౌండ్ లోకి వచ్చారు వాళ్ళ క్లాస్ లైన్ లో సోఫియా కూడా అరే నీయమ్మా ఇదెప్పుడొచ్చిందిరా అని మనసులో అనుకున్నాడు. రోజూ లాగానే క్లాస్ లు జరిగాయి, లంచ్ బెల్ అయింది సఫియా బాక్స్ తెచ్చుకోలేదు అనుకుంటా ఇంటికెళ్లింది తినడానికి. వెంబడి వెళ్దాం అనుకున్నాడు ఒక్కడిని ఎలా వెళ్లాలో అర్థం కాలేదు, రాజు ని తీసుకెళ్దాం అనుకున్నాడు, వాడికి చెప్పాలంటే కూడా కొచం టెన్షన్ గ ఉంది చెప్తే ఏం అంటాడో అని. మొత్తానికి ఆ రోజు కూడా FOLLOW చేయడం కుదరలేదు. తరువాత రోజు గురువారం UNIFORM ఉండదు, రోజు లాగానే స్కూల్ కి వచ్చి గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నాడు. ప్రేయర్ కి 5ని,,ల ముందు వచ్చింది. తాను నీలి రంగు పంజాబీ డ్రెస్ వెస్కొని వచ్చింది, లవ్ లో ఉంటే ఇంతేనేమో మనోడు కూడా నీలం రంగు షర్ట్ వెస్కొని వచ్చాడు.ప్రేయర్ అయిపొయింది, క్లాస్ లు అయిపోయాయి, LUNCH BELL అయింది. సఫియ ఇంటికి బయలుదేరింది, ఈ రోజు కచ్చితంగా వెంబడి వెళ్లాలని అనుకున్నాడు, ఎందుకంటే ఇద్దరు ఒకే కలర్ డ్రెస్ వెస్కొని వచ్చారు కదా ఇద్దరి మధ్య దేవుడు ఎదో రాసి పెట్టిండు అనుకున్నాడు. రాజు ని వెంటపెట్టుకొని FOLLOW చేస్తూ వెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గర్లో ఒక మలుపు దగ్గర్లో తాను మళ్లింది వీళ్ళు కొంచం స్పీడ్ పెంచి ముందుకి వెళ్ళారు. తాను కనిపించలేదు. అలాగే ముందుకి కొంత దూరం వెళ్లి వెతికి వచ్చారు కానీ సఫియా కనిపించలేదు. మళ్ళీ ఆ మలుపు దగ్గరికి వచ్చారు ఎందుకో మనోడికి వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటదేమో అన్పించింది అక్కడ ఉన్న ఇళ్ళని చూస్తున్నాడు. SUDDENగా పక్కన ఒక ఇంటివైపు చూస్తే చూస్తే పైనుండి సఫియా వీళ్ళని చూస్తుంది.. మనోడికి టెన్షన్ స్టార్ట్ అయింది అక్కడినుండి వెళ్లిపోయారు.
(తరువాయి భాగం)
No comments:
Post a Comment